కేజీ బంగారానికి స్కెచ్ వేసింది.. ఎలా దొరికిపోయిందో చూడండి వీడియో
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యాంగూన్ నుంచి వచ్చిన ఆ ప్రయాణికురాలు గ్రీన్ ఛానెల్ ద్వారా బయటికి వెళ్తుండగా తనిఖీ చేయగా, లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు దాచిపెట్టినట్లు గుర్తించారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా గుట్టురట్టయింది. యాంగూన్ నుంచి వచ్చిన ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయ భద్రతా తనిఖీలలో కస్టమ్స్ అధికారుల అప్రమత్తతను మరోసారి చాటిచెప్పింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు మహిళ గ్రీన్ ఛానెల్ ద్వారా విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డగించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలలో ఆమె తన లోదుస్తుల్లో చాకచక్యంగా దాచిపెట్టిన బంగారు బిస్కెట్లను గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్‌లో లక్షల్లో ఉంటుందని అంచనా.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
