నిందితుడ్ని పట్టించిన ల్యాప్‌టాప్‌పై డీఎన్ఏ !! అమెరికాలో ఏపీ మహిళ హత్య..
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం శశికళ నర్రా, ఆమె కుమారుడి హత్య కేసులో కీలక మలుపు. న్యూజెర్సీలో జరిగిన ఈ జంట హత్యల అసలు నిందితుడు హమీద్‌ను డీఎన్‌ఏ ఆధారాలతో గుర్తించారు. తొలుత భర్త అనుమానితుడిగా ఉన్నా, డీఎన్‌ఏతో నిర్దోషిగా తేలాడు. హమీద్ ల్యాప్‌టాప్ నుండి సేకరించిన డీఎన్‌ఏ ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో సరిపోలింది. అతడిని భారత్ నుండి అప్పగించాలని అమెరికా కోరుతోంది.
అమెరికాలో ఎనిమిదేళ్ల నాటి శశికళ నర్రా, ఆమె కుమారుడి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. దర్యాప్తు అధికారులు తాజాగా అసలు నిందితుడ్ని గుర్తించారు. వారి ఇంటి సమీపంలో ఉండే సహోద్యోగి హమీద్‌తో.. హనుమంతరావు కుటుంబానికి విబేధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. ఈ హత్యలతో హమీద్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేసారు. ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు అతని భార్య శశికళ, కుమారుడు అనీష్ తో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఉండేవారు. 2017 మార్చి 23న శశికళ, సాయి హత్యకు గురయ్యారు. ఆఫీసు నుంచి హనుమంతరావు ఇంటికి వచ్చేసరికి.. వారు ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో భార్య కుమారుడు విగతజీవిగా పడి ఉన్నారు. అయితే, హనుమంతరావుపై శశికళ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. కేరళకు చెందిన ఓ మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉందని, అడ్డుగా ఉన్నారని భార్యాబిడ్డలను హత్య చేశాడని ఆరోపించారు. దీంతో హనుమంతురావుపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. దర్యాప్తులో అసలు హంతకుడు అతడు కాదని తెలిసింది. ఘటనా స్థలిలో లభించిన డీఎన్‌ఏతో హనుమంతరావు డీఎన్‌తో సరిపోలకపోవడంతో పోలీసులు విడుదల చేశారు. అయితే..హత్యలు జరిగిన ఆరు నెలల తర్వాత హమీద్ భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో భారత్‌లోని హమీద్‌ను అమెరికా అధికారులు అతడిని సంప్రదించి, డీఎన్ఏ నమూనా ఇవ్వాలని అడిగారు. కానీ, హమీద్ ఇవ్వడానికి నిరాకరించడంతో కేసు అక్కడితో ఆగింది. దీంతో..అమెరికాలో ఉండగా, హమీద్‌కు జారీచేసిన ల్యాప్‌టాప్‌ను పంపాలని అతను పనిచేసిన కాగ్నిజెంట్ సంస్థను అమెరికా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కాగ్నిజెంట్ పంపిన ల్యాప్‌టాప్ నుంచి అధికారులు డీఎన్ఏ సేకరించి పరీక్షించారు. ఘటనా స్థలంలోని లభించిన డీఎన్‌ఏతో అది మ్యాచ్ కావడంతో హమీద్‌ను నిందితుడిగా తాజాగా అమెరికా పోలీసులు ప్రకటించారు. భారత్‌లో ఉన్న హమీద్ డీఎన్‌ఏ మ్యాచ్ కావడంతో అమెరికాకు అతన్ని తిరిగి అప్పగించాలని భారత విదేశాంగ శాఖను కోరారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హమీద్‌ను విచారిస్తే గానీ ఏంటి? అనేది బయటపడుతుంది. హనుమంతరావుపై పగతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా డ్యూటీ చేసిన ఎమ్మెల్యే
Rahul Sipligunj: సార్.. మీరు మా పెళ్ళికి తప్పకుండ రావాలి !!
మళ్లీ తెర మీదకు వస్తున్న క్లాసిక్ మూవీస్
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

