ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా డ్యూటీ చేసిన ఎమ్మెల్యే
రాజాజీనగర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ బెంగళూరులో ఒక రోజు ట్రాఫిక్ పోలీస్‌గా డ్యూటీ చేశారు. ట్రాఫిక్ నిర్వహణలోని కష్టాలను అనుభవించి, ప్రతి సోమవారం గంట పాటు పోలీసులకు సహాయం చేస్తానని ప్రకటించారు. పౌరులు కూడా 'బీటీపీ' యాప్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణలో పాల్గొనేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అవకాశం కల్పిస్తున్నారు. ఈ చొరవ ట్రాఫిక్‌ను మెరుగుపరుస్తుంది.
రాజాజీనగర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ మంగళవారం ట్రాఫిక్ పోలీస్ అవతార మెత్తారు. బెంగళూరులోని భాష్యం సర్కిల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్‌గా డ్యూటీ చేసారు. ట్రాఫిక్ పోలీసు జాకెట్ ధరించి ట్రాఫిక్ నిర్వహించడంతో పాటు వాహనదారులతో మాట్లాడారు. సిగ్నల్ కంట్రోల్ పోస్ట్‌ను నిర్వహించిన ఆయన.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని ప్రశ్నించారు. ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఒక్క రోజు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేయడం తనకు మంచి అనుభవం అనీ ఇక నుంచి ప్రతి సోమవారం ఒక గంట పాటు ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తానని, బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల చొరవ స్వాగతించదగింది అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహకరించాలనుకునే పౌరులకు ‘బీటీపీ ’ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. ఇందులో నమోదు చేసుకున్న పౌరులు వారి పరిధిలోని సిబ్బందితో కలిసి పని చేసే అవకాశం పొందుతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rahul Sipligunj: సార్.. మీరు మా పెళ్ళికి తప్పకుండ రావాలి !!
మళ్లీ తెర మీదకు వస్తున్న క్లాసిక్ మూవీస్
సౌత్ లో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న శ్రద్ధా కపూర్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

