ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా
ఐసిస్‌తో సంబంధాలున్న 8 మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనకు ఓటు వేస్తే.. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో వ్యాఖ్యానించారు.
ఐసిస్‌తో సంబంధాలున్న 8 మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనకు ఓటు వేస్తే.. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. ట్రంప్.. మన దేశం ఇప్పుడు ముందెన్నడూ లేనంతగా ప్రమాదంలో పడింది. వేలాది మంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశిస్తున్నారు. దీనికి అనేక ఏళ్లపాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో.. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటరు ఛాయిస్ సుస్పష్టం. వేలాదిమంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా? లేదా అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపించే అధ్యక్షుడు కావాలా? అనేది నిర్ణయించుకోండి అని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ను మొదలుపెడతానన్నారు. ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. అగ్రరాజ్యంలోకి వలసలు పోటెత్తుతున్నాయంటూ రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసదారులు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత, దేశాధ్యక్షుడు జో బైడెన్ సులభతరం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో ట్రంప్ తన వలసల వ్యతిరేక విధానాలను ఓటర్ల ముందు ఉంచారు. వలసదారులను పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలస్యంగా వచ్చారో.. అంతే సంగతులు… కేంద్రం కొత్త రూల్స్
ప్రపంచ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం
పబ్లిక్ టాయిలెట్‌లో టైమర్.. ఇదెక్కడి విడ్డూరం అంటున్న జనం