ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం

ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తళుక్కున మెరిసింది. న్యూజిల్యాండ్‌లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సీరాజ్‌.. భారత్‌కు ప్రాతినిథ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. మూడేళ్ల పాటు తాను ఎంతో శ్రమించి శిక్షణ పొందిన ఇన్‌లైన్‌ స్కేటింగ్‌లో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్ధులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది.

ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం

|

Updated on: Jun 18, 2024 | 8:27 PM

ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తళుక్కున మెరిసింది. న్యూజిల్యాండ్‌లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సీరాజ్‌.. భారత్‌కు ప్రాతినిథ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. మూడేళ్ల పాటు తాను ఎంతో శ్రమించి శిక్షణ పొందిన ఇన్‌లైన్‌ స్కేటింగ్‌లో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్ధులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. 13 ఏళ్ల వయసులోనే దేశంలోనే నెంబర్‌–1 స్కేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జెస్సీని రోలర్‌ స్కేటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది. జూన్‌ 13వ తేదీన న్యూజిల్యాండ్‌లోని TSB స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. పసిఫిక్‌ కప్‌ ఆర్టిస్టిక్‌ ఓపెన్‌ ఇన్విటేషనల్‌ కాంపిటిషన్‌ పేరుతో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో భారత్‌తో పాటు అస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఐర్లాండ్, జపాన్, న్యూజిల్యాండ్‌ దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. రెండు రౌండ్‌లలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారిణి జెస్సీ అత్యధికంగా 31.98 పాయింట్లు సాధించి ప్రపంచ స్థాయిలో మొదటి స్థానం సాధించి, బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ క్రీడా వేదికపై భారత జాతీయ పతకాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన జెస్సీని ఆంధ్రప్రదేశ్‌ రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి థామస్‌ చౌదరి, కోచ్‌ సింహాద్రి అభినందించారు. విజయవాడలోని NSM స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న జెస్సీ 2021 నుంచి స్కేటింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె ప్రాతినిథ్యం వహించిన జాతీయ పోటీల్లో ఒక గోల్డ్, ఒక సిల్వర్, మూడు బ్రాంజ్, రాష్ట్ర పోటీల్లో రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, రెండు బ్రాంజ్, జిల్లా స్థాయి పోటీల్లో నాలుగు గోల్డ్, ఎనిమిది సిల్వర్‌ మెడల్స్‌ సాధించింది. వీటితో పాటు స్కూల్‌ లెవల్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో 13, డాన్స్‌ పోటీల్లో ఒకటి, క్విజ్‌ పోటీల్లో రెండు, పెయింటింగ్‌ పోటీల్లో ఒక మెడల్‌ను సాధించి పిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పబ్లిక్‌ టాయిలెట్‌లో టైమర్‌.. ఇదెక్కడి విడ్డూరం అంటున్న జనం

నేరేడు పండ్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

బెండకాయను నానబెట్టిన నీళ్లు తాగితే షుగర్ పరార్

Follow us
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!