మిమ్మల్ని నేను తీసుకొస్తా… సునీతకు ట్రంప్‌ సందేశం వీడియో

Updated on: Mar 11, 2025 | 2:30 PM

అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే వారు త్వరలోనే భూమిమీదకు రానున్నారని పలు మీడియా సంస్థల ద్వారా తెలుస్తోంది. సునీత కూడా మంగళవారం ఐఎస్‌ఎస్‌ నుంచి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే భూమి మీదకు చేరుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.. మిమ్మల్ని సురక్షితంగా తీసుకురావడానికి వస్తున్నాం అని భరోసా ఇస్తూ.. వ్యోమగాములకు సందేశం పంపించారు.

అత్యంత అసమర్థ అధ్యక్షుడి పాలన కారణంగానే వారు ఇంతకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయారని.. వారిని భూమి పైకి తీసుకువచ్చేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అందులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని విమర్శించారు. ఇకపై అలా జరగనివ్వనని ట్రంప్‌ స్పష్టం చేశారు. వ్యోమగాములను సురక్షితంగా భూమి పైకి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్‌ మస్క్‌ కు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు. అతి త్వరలో మస్క్ స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటినుంచి సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు.. ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి నాసా స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్‌ఎస్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్‌ఎక్స్‌ సమయం కోరడంతో ఆలస్యం జరిగినట్టు గతంలో అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్‌ .. తర్వాత వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో

పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్‌.. వీడియో

యుద్ధ విమానాలు వద్దట..ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి?వీడియో