టోర్నడోల హెచ్చరిక.. అమెరికాలో తుపాను బీభత్సం వీడియో
అగ్రరాజ్యం అమెరికాను తుఫాను అతలాకుతలం చేస్తోంది. పలు రాష్ట్రాలను తుఫాను కుదిపేస్తోంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. బలమైన గాలులు వీస్తుండటంతో ఉత్తర కరోలినాలో అనేక కట్టడాలు ధ్వంసమయ్యాయి. తుఫాను కారణంగా మిసిసిపీలో ముగ్గురు మృతి చెందారు. ఓక్లహామాలో పలు చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. టెక్సాస్, ఓక్లహామా, లూసియానాలలో ఇప్పటికే వరుస టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో టెక్సాస్‌లోని శాన్ పాట్రిసియో కౌంటీలో కార్చిచ్చు సంభవించింది.
ఈ కారణంగా 20కిపైగా ఇళ్లు దగ్ధమయ్యాయిపసిఫిక్ ప్రాంతం నుంచి మరో తుఫాను ముప్పు పొంచి ఉండటంతో.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, భారీ హిమపాతం సంభవించనున్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో పలుచోట్ల రహదారులను మూసివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా టెక్సాస్, వర్జీనియా, టెన్నెసీలో వేలాది ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దాదాపు 800 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాన్ని ఆల్ఫ్రెడ్ తుపాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీని కారణంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేశారు. క్వీన్స్‌లాండ్ బ్రిస్బేన్ నగరంపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. న్యూ సౌత్‌వేల్స్ లో దాదాపు 5 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్టు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో
ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో
పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్.. వీడియో
యుద్ధ విమానాలు వద్దట..ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి?వీడియో

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
