టారిఫ్ విధానాన్ని మరోసారి సమర్థించుకున్న ట్రంప్ వీడియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. టారిఫ్ వ్యతిరేకులను మూర్ఖులుగా అభివర్ణించారు. టారిఫ్‌ల ద్వారా ఖజానాకు నిధులు సమకూరుతున్నాయని, రుణ ఒత్తిడి తగ్గుతుందని, ప్రతి అమెరికన్‌కు 2000 డాలర్ల డివిడెండ్ అందిస్తామని ట్రంప్ ప్రకటించారు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానాన్ని మరోసారి సమర్థించుకున్నారు. టారిఫ్‌లను వ్యతిరేకించే వారిపై విమర్శలు గుప్పించిన ట్రంప్, వారిని మూర్ఖులుగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. తన పరిపాలనలో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అవతరించిందని, అన్ని దేశాల నుండి గౌరవాన్ని అందుకుంటోందని ఆయన పేర్కొన్నారు. భారత్ సహా వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌ల వల్ల దేశ ఖజానాకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ అదనపు నిధుల ద్వారా రుణ ఒత్తిడి తగ్గి, జాతీయ స్థాయి రుణాలను తగ్గించేందుకు వినియోగిస్తామని అన్నారు. అంతేకాకుండా, త్వరలో ప్రతి అమెరికన్‌కు, ధనవంతులు మినహా, కనీసం 2000 డాలర్ల డివిడెండ్‌ను అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని ఆయన నొక్కి చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
