Viral Video: పెళ్లికాని తల్లుల నుంచి వారి పిల్లలను.. బలవంతంగా లాక్కెళ్ళారు.. ఎందుకో తెలుసా..?
గతంలో పెళ్లికాని తల్లుల నుంచి వారి పిల్లలను బలవంతంగా లాక్కెళ్ళి దత్తత ఇచ్చేలా చేసిన బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ జాయింట్ కమిటీ డిమాండ్ చేసింది.
గతంలో పెళ్లికాని తల్లుల నుంచి వారి పిల్లలను బలవంతంగా లాక్కెళ్ళి దత్తత ఇచ్చేలా చేసిన బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ జాయింట్ కమిటీ డిమాండ్ చేసింది. 1949, 1976 మధ్యకాలంలో ఇంగ్లండ్, వేల్స్ నుంచి దాదాపు లక్ష మందికి పైగా పిల్లలను బలవంతంగా దత్తతకు పంపించారని మానవ హక్కులకు సంబంధించిన పార్లమెంట్ జాయింట్ కమిటీ నివేదికలో పేర్కొంది. అత్యంత దారుణంగా తల్లి బిడ్డలను వేరు చేసే పాశవిక చర్యకు బ్రిటన్ ప్రభుత్వం పాల్పడిందని కమిటీ అధ్యక్షురాలు లేబర్ ఎంపీ హ్యారియెట్ హర్మాన్ అన్నారు. బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మానవ హక్కుల ప్యానెల్ పేర్కొంది. అంతేకాదు ఆ తల్లుల చేసిన ఏకైక నేరం పెళ్లి కాకుండా గర్భవతి కావడమే అని అప్పట్లో ఇది బ్రిటన్ చేసిన ఘోరమైన తప్పుగా కమిటీ పరిగణించింది. గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఐర్లాండ్ దేశాలు ఇలానే చేశాయని, అందుకు క్షమాపణలు కూడా చెప్పాయని ఆమె తెలిపారు. 1963లో ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్‌లలో అబార్షన్‌ని చట్టబద్దం చేసినప్పటికీ మహిళలు ఈ సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చింది. పెళ్లి కాకుండా తల్లికావడాన్ని ఘోరంగా చూడటం వల్లే ఈ పరిస్థితి వాటిల్లిందని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..