AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrs.International: మిసెస్‌ ఇంటర్నేషనల్‌ పోటీలో తెలుగు బ్యూటీ.. ఖండాలు దాటిన తెలుగు అందం..

Mrs.International: మిసెస్‌ ఇంటర్నేషనల్‌ పోటీలో తెలుగు బ్యూటీ.. ఖండాలు దాటిన తెలుగు అందం..

Anil kumar poka
|

Updated on: Jun 27, 2022 | 9:26 PM

Share

మిసెస్‌ ఇంటర్నేషనల్‌ పోటీలకు అందంతో పనిలేదు. ఆత్మసౌందర్యం, అంతఃసౌందర్యమే ప్రధానం. అంతఃసౌందర్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఉలి లాంటిది.


మిసెస్‌ ఇంటర్నేషనల్‌ పోటీలకు అందంతో పనిలేదు. ఆత్మసౌందర్యం, అంతఃసౌందర్యమే ప్రధానం. అంతఃసౌందర్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఉలి లాంటిది. ఆ ఉలి చెక్కిన శిల్పమే ఆత్మవిశ్వాసం. అది భావవ్యక్తీకరణలో బహిర్గతమవుతుంది. బాధ్యతాయుతమైన వ్యక్తి అని, ఒక సామాజిక బాధ్యత అప్పగిస్తే కర్తవ్యానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనే విశ్వాసం కలిగించడానికి ఒక వేదిక ఈ మిసెస్‌ ఇంటర్నేషనల్‌ పీజంట్‌. అమెరికాలో జరిగే ఈ మిసెస్‌ ఇంటర్నేషనల్‌ పోటీలకు ఈ ఏడాది కూడా అనేక దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే ఈ పోటీల్లో ఓ తెలుగు మహిళ రాధికామూర్తి కూడా పాల్గొంటున్నారు. అయితే ఆమె యూకే నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో పుట్టి పెరిగిన రాధికామూర్తి పన్నెండేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌గా లండన్‌లో అడుగుపెట్టి, అక్కడే స్థిరపడ్డారు. యూకేలో నివసిస్తున్న భారతీయులు పరస్పరం కలవడం కోసం మిసెస్‌ ఇండియా యూకే వంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైందన్నారు రాధిక. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కాలంతో పోటీ పడి పరుగులు తీస్తున్న సమయంలో కూడా రాధికామూర్తి ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయలేదెప్పుడూ. ఇక మిసెస్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో పాల్గొనే వాళ్ల నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. సమాజంలో ఒక వ్యక్తిగా, కుటంబంలో కీలకమైన వ్యక్తిగా ఎంత బాధ్యతగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారనేది ముఖ్యం. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతరుల పోస్టులకు ప్రతిస్పందించే తీరు కూడా ముఖ్యమైన అంశమే. నేను నా వంతు సామాజిక బాధ్యతగా చేసిన కొన్ని పనుల గురించి ఆ ఇంటర్వ్యూలోచెప్పాను. మిసెస్‌ ఇండియా యూకే టీమ్‌ గత ఏడాది నుంచి నాకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ పోటీలకు మనదేశం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి పరిచయం చేసుకుంటాను అంటున్నారు రాధికామూర్తి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens coin: యువకుడికి దొరికిన ఏలియన్స్‌ నాణెం.. సోషల్‌ మీడియాలో కాయిన్‌పై రచ్చ..!

Priest: మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి.. ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే..

Runner @105: రన్నర్‌@105.. రాంబాయి రూటే సపరేటు.. వీడియో చుస్తే మెచ్చుకోవడం ఖాయం..

Published on: Jun 27, 2022 09:26 PM