కోట్లలో భారీ స్కామ్.. బాధితుల్లో భారతీయులు..
నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల గుట్టును రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ రట్టు చేసింది. అంతర్జాతీయ నెట్‌వర్క్‌గా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలను వీరు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. భారత్ సహా దాదాపు 50కి పైగా దేశాల్లో వీరి బాధితులు ఉన్నట్లు తెలిసింది.
ఈ స్కామ్‌పై దర్యాప్తు చేపట్టిన రష్యా అధికారులు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ కాల్ సెంటర్ల ముఠాకు లండన్‌లో నివాసముంటున్న జార్జియా మాజీ రక్షణ మంత్రి డి కజెరాశ్‌విలితో సంబంధాలున్నాయని రష్యా ఎఫ్‌ఎస్‌బీ అధికారులు వెల్లడించారు. ఈ కాల్‌సెంటర్లలో పనిచేసే ఆపరేటర్లు రోజూ అనేక మందికి ఫోన్ చేసి పెట్టుబడుల స్కీమ్‌లు అంటూ ఆశ పెడుతున్నారు. భారీ లాభాలు వస్తాయంటూ వారిని బుట్టలో వేసుకుంటున్నారు. ఇలాంటి మోసపూరిత చర్యలతో బాధితుల నుంచి రోజుకు కనీసం 1 మిలియన్ డాలర్ల మేర, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8కోట్లకు పైమాటే దోచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిలియన్ సం.రాలు పట్టే లెక్కను 5 నిమిషాల్లో చేసేస్తుంది.. అద్భుతం అన్న మస్క్
మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..
ట్రంప్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా ??