Pig Heart Into Human Body: వైద్యశాస్త్రంలో మరో మిరాకిల్.. మనిషికి పంది గుండె అమరిక సక్సెస్..(లైవ్ వీడియో)
వైద్యశాస్త్రంలో మరో మిరాకిల్. సకాలంలో అవయవాలు దొరక్క అవస్థలు పడుతున్నవారికి అమెరికన్ వైద్యులు ఒక శుభవార్త చెప్పారు. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చి వైద్యశాస్త్రంలో ఒక చారిత్రక ఘట్టానికి తెరతీశారు.
వైద్యశాస్త్రంలో మరో మిరాకిల్. సకాలంలో అవయవాలు దొరక్క అవస్థలు పడుతున్నవారికి అమెరికన్ వైద్యులు ఒక శుభవార్త చెప్పారు. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చి వైద్యశాస్త్రంలో ఒక చారిత్రక ఘట్టానికి తెరతీశారు. బాల్టిమోర్ మేరీలాండ్ మెడికల్ స్కూల్ హాస్పిటల్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది. పంది నుంచి తీసిన గుండెను సక్సెస్‌ఫుల్‌గా 57 సంవత్సరాల డేవిడ్ బెన్నెట్‌కు అమర్చారు. జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను అమర్చి ఆయన ప్రాణాన్ని కాపాడారు. సంప్రదాయ గుండె మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించకపోయే సరికి వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ బెన్నెట్ కోలుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచాలని డాక్టర్లు చెబుతున్నారు. . పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే మాత్రం మనిషి సాధించిన అద్భుతమైన విజయాలలో ఇదొకటిగా చరిత్రలో నిలిచిపోతుంది.మెడికల్ సైన్స్‌లో ఇదో చారిత్రక ఘట్టం. ఫ్యూచర్‌లో ఆర్గాన్ డొనేషన్స్ కొరత చాలా మట్టుకు తగ్గించుకోవచ్చు. లాస్టియర్ అక్టోబర్‌లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో ఇంచుమించు ఇలాంటి ఆపరేషనే జరిగింది. బ్రెయిన్ డెడ్ అయి ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. ఇప్పుడాయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. చాలా మంది గుండె మార్పికి ముందే చనిపోతున్నారు. అమెరికాలో అయితే ఏడాదికి ఆరువేలమందికిపైగా ఇలా మృత్యువాత పడుతున్నారు. ఆర్గాన్స్ కొరత ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికిపైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 1984లో కోతిజాతికి చెందిన బబూన్ గుండెను పసికందుకు అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ ఆ శిశువు 20 రోజుల కంటే ఎక్కవ జీవించలేకపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదు. వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు జరిగే అవకాశం ఉంది.