ఆమెకు ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. తీరని ఆవేద

ఆమెకు ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. తీరని ఆవేద

Phani CH

|

Updated on: Feb 14, 2024 | 5:46 PM

ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్స్‌కు మించిన తెలివితేటలు మహ్నూర్‌ చీమా సొంతం. 161 ఐక్యూ సాధించిన మహ్నూర్‌... తనలాంటి అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకి బ్రిటన్‌లోని పాఠశాలలు మద్దతు అందించాలని పోరాటం చేస్తోంది. తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతో పాటు బ్రిటన్‌కు వలస వచ్చింది. కానీ బ్రిటన్‌లో ఉపాధ్యాయులు ఆమెను పైతరగతికి ప్రమోట్‌ చేయలేదు. పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారట.

ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్స్‌కు మించిన తెలివితేటలు మహ్నూర్‌ చీమా సొంతం. 161 ఐక్యూ సాధించిన మహ్నూర్‌… తనలాంటి అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకి బ్రిటన్‌లోని పాఠశాలలు మద్దతు అందించాలని పోరాటం చేస్తోంది. తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతో పాటు బ్రిటన్‌కు వలస వచ్చింది. కానీ బ్రిటన్‌లో ఉపాధ్యాయులు ఆమెను పైతరగతికి ప్రమోట్‌ చేయలేదు. పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారట. ఇప్పుడామె వయస్సు 17 ఏళ్లు. మహ్నూర్‌ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలామంది విద్యార్థులు ఉన్నారని, అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని, ఫలితంగా వారి ప్రతిభ వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని, వారు కూడా తనలానే నిరాశతో ఉన్నారని చెప్పింది. బ్రిటీష్ విద్యావ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతుందని, బ్రిటన్‌లోని 11 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్‌లో మూడవ సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పిచ్చపిచ్చగా నచ్చిన వెబ్ సైట్ ఇదే

స‌ట్లెజ్‌ న‌దిలో త‌మిళ డైరెక్ట‌ర్ మృత‌దేహం.. తొమ్మిది రోజుల తర్వాత లభ్యం

Prabhas: మనసు మార్చుకున్న ప్రభాస్‌.. అయితే సందీప్‌ రెడ్డి సినిమా పక్కకే..

బన్నీతో సినిమా చేయాలనుకున్నా.. కానీ ఆయన చెప్పింది వేరే..

డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌ ‘వాలెంటైన్స్ డే’ స్ట్రైక్‌