Airlines: ఎయిర్‌లైన్స్‌లో కొత్త రూల్.! గర్భిణి క్యాబిన్ సిబ్బంది కూడా..! గర్భిణిలు తాత్కాలికంగా చేసుకోవచ్చు..
సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాబిన్ సిబ్బందిలో గర్భిణులను విధులనుంచి తొలగించబోమని, అలాంటి వారు తాత్కాలికంగా గ్రౌండ్ అటాచ్‌మెంట్ పని చేసుకోవచ్చని..
గత కొంతకాలంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై పలు విమర్శలు ఉన్నాయి. లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.అంతేగాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి, డెలివరీ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తుందని, సర్వత్ర విమర్శలు రావడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ కొత్త రూల్‌ని అమలు చేయనుంది. ఈ గర్భిణి సిబ్బంది మూడు నుంచి తొమ్మిది నెలలు గ్రౌండ్ ప్లేస్‌మెంట్‌లో విధులు నిర్వర్తించవచ్చు అని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన తమ సిబ్బందిని వదులుకోమని కూడా తెలిపింది. దీనిపై అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్, ప్రసవానంతరం తల్లులు విమాన ప్రయాణం చేయకుండా మరేదైనా బాధ్యతలు అప్పగించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. అంతేగాదు ఈ కొత్త రూల్ కచ్చితంగా అమలవుతుందా అని కూడా ఎయిర్‌లైన్స్‌ని నిలదీశారు. ఐతే సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంపై ఇంకా స్పందించ లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.