AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందటం.. ఇక ఈజీ కాదు

పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందటం.. ఇక ఈజీ కాదు

Phani CH
|

Updated on: Aug 07, 2025 | 6:04 PM

Share

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ముఖ్యంగా వివాహం ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్న వారికి ఇది షాకింగ్ వార్తే. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS), వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుల కోసం కొత్త, కఠినమైన కొత్త రూల్స్ తెచ్చింది. మోసపూరిత వివాహాలను అరికట్టి, గ్రీన్ కార్డ్ జారీలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఈ నెల 1న విడుదల చేసిన గైడ్ లైన్స్‌లో యూఎస్‌ సీఐఎస్ స్పష్టం చేసింది.

కొత్త రూల్స్ ప్రకారం.. ఇక గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి జంట.. తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అంతేకాకుండా, తమది నిజమైన పెళ్లి అని నిరూపించే బలమైన సాక్ష్యాలను సమర్పించాలి. జంటగా దిగిన ఫొటోలు, ఉమ్మడి బ్యాంకు ఖాతాలు, ఆస్తి పత్రాలు, వివాహాన్నిధ్రువపరుస్తూ.. మిత్రులు, కుటుంబ సభ్యులు ఇచ్చే అఫిడవిట్లు కూడా ఉండాలి. ఇప్పటికే అమెరికాలో హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై ఉంటూ, వివాహం ద్వారా తమ స్టేటస్‌ను మార్చుకోవాలనుకునే వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దరఖాస్తుదారుల పాత ఇమ్మిగ్రేషన్ చరిత్రను, గతంలో ఎవరైనా ఒకే వ్యక్తి వేర్వేరు వ్యక్తులను స్పాన్సర్ చేశారా? అనే కోణంలోనూ లోతుగా పరిశీలిస్తారు. ఈ రూల్స్‌లో మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఒకవేళ గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందినా, ఇతర చట్టపరమైన కారణాల వల్ల దరఖాస్తుదారుడు అక్కడ ఉండటానికి అనర్హుడని తేలితే, అతడిని దేశం విడిచి వెళ్లమని ఆదేశిస్తూ నోటీస్ టు అప్పియర్ (NTA) జారీ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని యూఎస్‌ సీఐఎస్ తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో ఇకపై.. దరఖాస్తుదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. పాత ఫారాలు వాడటం, అసంపూర్తిగా వివరాలు ఇవ్వడం వంటి పొరపాట్లు చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చాలా కష్టంగా మారిన ఈ ప్రక్రియలో లాయర్ల సహాయం తీసుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త రూల్స్ వల్ల గ్రీన్ కార్డ్ ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చని, కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని, అందుకే ఈ కొత్త విధానం మీద అందరికీ అవగాహన కలిగించాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా 3115 రైల్వే ఉద్యోగాల భర్తీ

‘దేవుడి దగ్గరికి వెళ్తున్నా..’ ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ

రోజుకు రూ. 411 కడితే.. చేతికి రూ.43 లక్షలు.. ఈ అదిరిపోయే స్కీమ్ ఏదంటే..

మయసభ రివ్యూ.. పొలిటిక‌ల్ డ్రామా ఎలా ఉందంటే?