ఎక్కువ మంది చూడాలనుకునే దేశాలివే !! వీడియో

గత కొన్ని నెలలుగా పర్యాటక రంగం దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత విదేశాల్లో పర్యటించాలని కొందరు ప్రణాళికలు వేసుకుంటున్నారు.

గత కొన్ని నెలలుగా పర్యాటక రంగం దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత విదేశాల్లో పర్యటించాలని కొందరు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏ దేశానికి వెళ్తే బాగుంటుంది? ఎక్కువ మంది వెళ్లే పర్యాటక ప్రాంతాలేవి? అని గూగుల్‌ చేస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా అత్యధిక మంది సందర్శిస్తున్న దేశాల జాబితాను వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ సంస్థ రూపొందించింది. చాలా మంది ఈఫిల్‌ టవర్‌ చూడటానికే ఫ్రాన్స్‌ వస్తుంటారట. ఇతర దేశాల కంటే యూరప్‌ దేశాల ప్రజలే ఫ్రాన్స్‌ను ఎక్కువగా సందర్శిస్తుంటారట. యూరప్‌లోని మరో దేశం స్పెయిన్‌ జాబితాలో రెండో స్థానంలో ఉంది. సహజంగా ఏర్పడిన బీచ్‌లు, రన్నింగ్‌ ఆఫ్‌ ది బుల్స్‌ క్రీడ కోట్లమందిని ఆకర్షిస్తున్నాయి. ఇక చాలామంది ఒక్కసారైనా వెళ్లాలనుకునే దేశం అమెరికా. న్యూయార్క్‌, లాస్‌ వేగాస్‌, లాస్‌ ఏంజిలెస్‌ ప్రాంతాలకే అత్యధిక మంది పర్యటకులు వస్తుంటారని నివేదికలో వెల్లడైంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

వెడ్డింగ్ పార్టీలో ఊహించని ఘటన !! షాక్‌తో తలలు పట్టుకున్న అతిథులు !! వీడియో

టాయ్‌లెట్‌కి వెళ్లిన టూరిస్ట్‌పై కాలనాగు దాడి !! కాటు ఎక్కడ వేసిందంటే ?? వీడియో

Trisha: ఈ విషయం తెలిసి నా గుండె బద్దలైంది !! వీడియో

Viral Video: 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu