తాలిబన్ల రాజ్యంలో ఘనంగా నవరాత్రి వేడుకలు.. వీడియో

ప్రపంచవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా తాలిబన్ల దేశమైన ఆఫ్గానిస్తాన్‌లోనూ నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా తాలిబన్ల దేశమైన ఆఫ్గానిస్తాన్‌లోనూ నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కాబూల్‌లో ఆశామాయి ఆలయంలో జరిగిన దుర్గమ్మ పూజకు.. వందలాదిమంది హిందువులు, సిక్కులు హాజరై.. ఆలయంలో భజనలు, కీర్తనలు పాడారు. తాలిబన్ల రాజ్యంలో భక్తిశ్రద్దలతో నవరాత్రి వేడుకలు నిర్వహించడం సంచలనం రేపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కాబూల్‌లో ఇంకా 150 మందికి పైగా హిందువులు, 200 మందికి పైగా సిక్కులు ఉన్నారు. భారత్‌కు తరలించాలని వాళ్లు కేంద్రాన్ని పదేపదే కోరుతున్నారు. హిందూ ఆలయాలను, సిక్కు గురుద్వారాలను తాలిబన్లు టార్గెట్‌ చేసినప్పటికి వాళ్ల ఏమాత్రం భయపడడం లేదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్.. వీడియో

Ram Charan: శంకర్ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu