ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఒక్కసారిగా బిల్డింగ్‌పై కుప్పకూలిన విమానం.. వీడియో

ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లో ఎనిమింది మంది దుర్మరణం చెందారు. ఖాళీగా ఉన్న ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు.

ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లో ఎనిమింది మంది దుర్మరణం చెందారు. ఖాళీగా ఉన్న ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. అయితే విమానంలో ఉన్న వారే మరణించారని.. బిల్డింగ్ ఎవరూ లేకపోవడంతో మరణాల సంఖ్య తగ్గినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మిలాన్‌లోని లినేట్ విమానాశ్రయం నుంచి స‌ర్డినియా దీవికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్రయాదం జ‌రిగింది. రొమేనియాకు చెందిన బిలియ‌నీర్ డాన్ పెట్రెస్కూ ఆ విమానానికి పైలెట్‌గా ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య, కుమారుడు, మరో ఐదుగురు ప్రతినిధులు ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం కూలిన బిల్డింగ్ ఆఫీసు పూర్తిగా ధ్వంస‌మైంది. అక్కడ ఉన్న కార్లకు, ఫర్నిచర్‌కు నిప్పు అంటుకుని భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Samantha: సమంత నుంచి ఇలాంటి కామెంట్స్‌ ఎవరూ ఊహించి ఉండరు.. వీడియో

Know This: ఈ చిన్ని ద్వీపంలో రాజు, మరో 11 మందే ఉంటారు.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu