Know This: ఈ చిన్ని ద్వీపంలో రాజు, మరో 11 మందే ఉంటారు.. వీడియో
ఈ ద్వీపం చూడటానికి ఓ ప్రైవేటు ఐలాండ్‌లా కనిపించినా.. ఇది ఓ రారాజు పరిపాలిస్తున్న ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నరాజ్యం. ఆ రాజ్యంలో జనాభా పదకొండు మంది.
ఈ ద్వీపం చూడటానికి ఓ ప్రైవేటు ఐలాండ్‌లా కనిపించినా.. ఇది ఓ రారాజు పరిపాలిస్తున్న ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నరాజ్యం. ఆ రాజ్యంలో జనాభా పదకొండు మంది. వారంతా ఆ చక్రవర్తి కుటుంబసభ్యులే. టవోలారా.. ఇటలీకి పశ్చిమాన ఉన్న సార్డినియా ఐలాండ్‌కు సమీపంలోని చిన్న ద్వీపం. దీని విస్తీర్ణం కేవలం 5 చదరపు కిలోమీటర్లు. ఈ రాజ్యంలో ప్రస్తుత చక్రవర్తి 87 ఏళ్ల ఆంటోనియో బెర్టోలియోని. ఆయన కుటుంబ సభ్యులు పది మంది. వీరే అక్కడ నివసిస్తున్నారు. ఈ ఐలాండ్‌కు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ వివిధ జాతులకు చెందిన మేకలు, అందమైన బీచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: సంకల్పం ముందు వైకల్యం ఓడింది.. కాళ్ళతో ఏకంగా విమానాన్నే నడిపేస్తోంది.. వీడియో
అవిభక్త కవలలను విడదీసిన జోర్డన్ వైద్యులు.. విజయవంతంగా అరుదైన ఆపరేషన్.. వీడియో
Published on: Oct 08, 2021 09:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos