Golden Chariot: స్వర్ణ రథంపై బ్రిటన్ రాజు.. పట్టాభిషేకానికి పయనం.. కన్నుల విందుగా వీడియో..
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా పట్టాభిషిక్తుడు కానున్నారు. 73 ఏళ్ల వయసులో ఈ పదవిని అలంకరించనున్న తొలి రాజుగా ఛార్లెస్..
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా పట్టాభిషిక్తుడు కానున్నారు. 73 ఏళ్ల వయసులో ఈ పదవిని అలంకరించనున్న తొలి రాజుగా ఛార్లెస్.. బ్రిటన్ రాజ చరిత్రలో నూతన అధ్యాయం లిఖించనున్నారు. కాగా బ్రిటన్ రాజు చార్లెస్ III పట్టాభిషేకం జూన్ 2023లో జరగవచ్చు. ఈ కార్యక్రమానికి ఆయన స్వర్ణరథంపై వెళ్లనున్నారు. 1762 నాటి గోల్డ్ స్టేట్ కోచ్ ఇప్పటి వరకు అన్ని పట్టాభిషేకాల్లో ఉపయోగించబడింది. ఈ బంగారు రథాన్ని 1762లో బ్రిటిష్ రాజులు, రాణుల ప్రయాణాల కోసం తయారు చేశారు. ఈ రాయల్ రైడ్ పట్టాభిషేకాలు, వార్షికోత్సవాలు, ఈవెంట్‌ల కోసం వినియోగిస్తారు. ఈ స్వర్ణ రథాన్ని విలియం ఛాంబర్స్ రూపొందించగా.. శామ్యూల్ బట్లర్ నిర్మించారు. 1821లో జార్జ్ IV పట్టాభిషేకం జరిగినప్పటి నుండి ప్రతి పట్టాభిషేకంలో ఇది ఉపయోగిస్తూ వచ్చారు. ఈ రథం పొడవు ఏడు మీటర్లు, ఎత్తు 3.6 మీటర్లు. కాగా 4 టన్నుల బరువు కలిగిన ఈ రథాన్ని 8 అశ్వాలు లాగుతాయి. గిల్ట్‌వుడ్‌తో తయారు చేసిన ఈ రథానికి పైన బంగారు పూత పూసారు. లోపల వెల్వెట్‌తో తయారు చేయబడింది. ఇక ఈ రథంలో రోమన్ దేవీదేవతల అద్భుతమైన చిత్రాలు ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం 1953లో ఈ బంగారు రథంపైనే జరిగింది. రాణి ప్లాటినం జూబ్లీ సందర్భంగా కూడా ఈ రథాన్ని ప్రదర్శించారు. అందులో ఎలిజబెత్ II హోలోగ్రామ్ ఉంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆ బంగారు రథం బయటకు రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

