అణుయుద్ధమే జరిగితే ?? 72 నిమిషాల్లో 5 బిలియన్ల మంది ప్రాణాలొదిలే ప్రమాదం

అణుయుద్ధమే జరిగితే ?? 72 నిమిషాల్లో 5 బిలియన్ల మంది ప్రాణాలొదిలే ప్రమాదం

Phani CH

|

Updated on: Aug 09, 2024 | 1:57 PM

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌ ఇరాన్‌ ఘర్షణలు.. ఒకవేళ వీటి మధ్య ఇపుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు? అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న. అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్నీ జాకబ్‌సెన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన 72 నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు. రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది.

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌ ఇరాన్‌ ఘర్షణలు.. ఒకవేళ వీటి మధ్య ఇపుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు? అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న. అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్నీ జాకబ్‌సెన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన 72 నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు. రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అణువిస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే. అణుయుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు. ఆకలితో అలమటించి. పోషకాహార లోపంతో కృంగి కృశించి ప్రాణాలొదులుతారు. గత అనుభవాలను నెమరవేసుకుంటే.. హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి 79 ఏళ్లు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం. జపాన్‌లో 1945 ఆగస్ట్‌ 6న జరిగిన అణు బాంబు పేలుళ్లు.. హిరోషిమాలో లక్షా 40వేల మంది, నాగసాకిలో 74వేల మందిని బలి తీసుకున్న ఉదంతాన్ని ఎవరూ మర్చిపోలేరు. మరో మూడు రోజులకు అంటే ఆగస్టు 9న నాగసాకి నగరంపై… అమెరికా మరో భారీ అణుబాంబుతో దాడి చేసింది. ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడికి విలవిల్లాడిన జపాన్… శత్రు దేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్ట్ 14న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువుల ప్రభావంతో బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీతం. అణ్వాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కడుతుంది ఈ హీరోషిమా డే మారణహోమం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంత్యక్రియల పేరుతో మోసం శవాలను దాచేసి.. చితాభస్మంగా బూడిద ఇచ్చారు