అవి డ్రోన్లు కావు.. ఆటబొమ్మలు.. ఇజ్రాయెల్‌ను హేళన చేసిన ఇరాన్‌

|

Apr 21, 2024 | 4:09 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌ లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా.. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించిన డ్రోన్లు తమకు ఆటబొమ్మల్లాంటివంటూ ఇజ్రాయెల్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌ లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా.. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించిన డ్రోన్లు తమకు ఆటబొమ్మల్లాంటివంటూ ఇజ్రాయెల్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికాలోని న్యూయార్క్‌ పర్యటనలో ఉన్న హొస్సేన్‌.. భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం జరిగింది దాడే కాదు. అవి డ్రోన్లు కావు తమ పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లాంటివని వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ ఎలాంటి సాహసం చేయలేదు కాబట్టి.. ఇప్పుడు తాము ప్రతిచర్యకు దిగట్లేదు కానీ ఒకవేళ ఆ దేశం తమకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం.. తమ ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందనీ దానికి వాళ్లు పశ్చాత్తాపపడాల్సి ఉంటుందని నెతన్యాహు సర్కారును హెచ్చరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపై గాయాలతో పునుగుపిల్లి.. టీవీ9 సమాచారంతో

TOP 9 ET News: నలుగురు హీరోల దెబ్బకు బాలీవుడ్‌లో రూ.500 కోట్లు ఖల్లాస్‌

Puspa 02: పుష్ప రాజ్‌గా ఇరగదీసిన బుడ్డోడు..

దురదృష్టవంతురాలని సినిమాల నుంచి తీసేశారు

War 02: దిమ్మతిరగే న్యూస్.. వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..