Hamas-Israel: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి..
అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు జీవించి ఉండి ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. కానీ, ఈ వాదనను బలపర్చే ఆధారాలేవీ వారి వద్ద వున్నట్టు ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి.
అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు జీవించి ఉండి ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. కానీ, ఈ వాదనను బలపర్చే ఆధారాలేవీ వారి వద్ద వున్నట్టు ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. వీటిల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అనేది ఐడీఎఫ్‌కు అర్థం కావడం లేదు. మరోవైపు ఇజ్రాయెలే, హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి లొంగదీసుకోవడానికి ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్‌లో కూడా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, అప్పుడు అతడు దాక్కోవడంలో భాగంగానే అనుచరులకు దూరంగా ఉన్నట్లు తేలింది. కాగా, ఇజ్రాయెల్ వాయుసేన సెంట్రల్ గాజాలో జరిపిన వైమానిక దాడిలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ధ్వంసమైంది. దీనిని ఖలీద్ ఇబ్న్ అల్ వాలీద్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఐడీఎఫ్ బలగాలు వెల్లడించాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.