Reels craze: రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

Reels craze: రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Sep 28, 2024 | 9:09 PM

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావాలని కొందరు ఎంచుకున్న మార్గం రీల్స్. ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. రీల్స్‌ సరదాతో కొందరు చేసే పనులు.. ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకొంది. సైకిల్‌పై వెళుతున్న వారి ముఖాలపై ఫోమ్‌ కొట్టిన ఓ యువకుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

ఝాన్సీలో నిత్యం రద్దీగా ఉండే నవాబాద్‌ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఆ రోడ్డులో ఓ వృద్ధుడు సైకిల్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు అతడి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఒక వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తూ ఉంటే.. మరో యువకుడు ఆ వృద్ధుడి ముఖంపై వైట్‌ ఫోమ్‌ను స్ప్రే చేశాడు. మరికొంత దూరం వెళ్లాక మరో వ్యక్తితోనూ ఇదే విధంగా ప్రవర్తించారు. పైగా దీన్ని ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. యువకుల చర్యపై కోప్పడ్డారు.

రద్దీగా ఉన్న ప్రాంతంలో వృద్ధుడితో ఇలా ప్రవర్తించడం సరికాదనీ అతను కింద పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ఒకరు.. రీల్స్‌ కోసం ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మరొకరు.. రీల్స్‌ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదుంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే ఒక నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.