Zambia President: జాంబియా దేశాధ్యక్షుడిగా గొర్రెల కాపరి.. 10 లక్షల ఓట్ల మెజారిటీతో..!! వీడియో

Zambia President: జాంబియా దేశాధ్యక్షుడిగా గొర్రెల కాపరి.. 10 లక్షల ఓట్ల మెజారిటీతో..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 27, 2021 | 9:43 AM

జాంబియాలో ఇప్పటి వరకు ప్రముఖ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న హిచిలేమా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనారు.

జాంబియాలో ఇప్పటి వరకు ప్రముఖ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న హిచిలేమా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనారు. హిచిలేమాను ముద్దుగా హెచ్‌హెచ్‌ లేదా బల్లె అని పిలుస్తారు. బల్లె అంటే తండ్రి అని అర్థం. జాతీయ అభివృద్ధి ఐక్యతా పార్టీకి అధ్యక్షుడైన హిచిలేమా ఆరు సార్లు పోటీ చేసినా ఐదుసార్లు ఓటమిపాలయ్యారు. ఎట్టకేలకు ఆరోసారి 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రంతరం కావడం, స్వేచ్ఛ లేకపోవడంతో ప్రజలు మార్పును కోరుకున్నట్టు తెలుస్తున్నది. కరోనా రాక ముందే దేశ జనాభాలో సగం మంది దారిద్ర రేఖకు దిగువనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ద్రవ్యోల్భనం 24 శాతం పెరగడంతో ప్రజలు జీవించడమే కష్టం అయిపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Kamal Haasan: రైటర్ గాను మారనున్న విశ్వనటుడు.. సీక్వెల్‌ కోసం స్వయంగా కథ రెడీ చేస్తున్న కమల్..

Pakistan: కశ్మీర్‌ కోసం తాలిబన్ల సాయం.. వక్రబుద్ధి బయటపెట్టిన పాకిస్తాన్‌.. వీడియో