ట్రంప్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా ??
తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి వెళ్లగొట్టి, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానని అగ్రరాజ్యానికి కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇది భారతీయులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలు వెల్లడించారు.
అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి అని ట్రంప్ అన్నారు. కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్థులు నేరుగా అమెరికాకు వస్తున్నారు. అలాంటి 13,099 మంది నేరస్థులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదు. తక్షణం వెళ్లగొట్టాలని అన్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానం లో చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారని, వారిలో చాలామంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని చెప్పారు. వారి సమస్యను పట్టించుకుంటానని స్పష్టంచేశారు. ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలసి ఒక పరిష్కారం కనుగొంటానని వివరించారు. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్నారని, దీన్ని నిరోధించకపోతే ఆ రెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై రెండు దేశాలు హాహాకారాలు చేయగా కెనడా, మెక్సికోలు అమెరికాలో 51వ, 52వ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!
అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్ !!
పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు
చేతబడులు.. భయంకర సంఘటనలు.. ఆహాలో హడలెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమా
430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !! అది డా… సూపర్ స్టార్ అంటే !!