Hamas-Israel: గాజాలో ఆకలి కేకలు.. ఆహారం కోసం గోదాముల్లో చొరబడుతున్న నిస్సహాయులు.

Hamas-Israel: గాజాలో ఆకలి కేకలు.. ఆహారం కోసం గోదాముల్లో చొరబడుతున్న నిస్సహాయులు.

Anil kumar poka

|

Updated on: Oct 30, 2023 | 10:57 AM

హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకీ ఉదృతం అవుతోంది. గాజాలో ఇజ్రాయెల్‌ దళాలు భూతల దాడులను ఉధృతం చేశాయి. దీంతో గాజాలోని ప్రజలు దేశం విడిచి పారిపోలేక, అక్కడ సురక్షితంగా ఉండలేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆహారం, తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. మందులు, ఇతర అత్యవసర సామగ్రి లేక దారుణంగా ఉంది వారి పరిస్థితి. ఈ క్రమంలో వీరికి సాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాంలలోకి వేల మంది నిస్సహాయులు చొరబడి.. ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకీ ఉదృతం అవుతోంది. గాజాలో ఇజ్రాయెల్‌ దళాలు భూతల దాడులను ఉధృతం చేశాయి. దీంతో గాజాలోని ప్రజలు దేశం విడిచి పారిపోలేక, అక్కడ సురక్షితంగా ఉండలేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆహారం, తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. మందులు, ఇతర అత్యవసర సామగ్రి లేక దారుణంగా ఉంది వారి పరిస్థితి. ఈ క్రమంలో వీరికి సాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాంలలోకి వేల మంది నిస్సహాయులు చొరబడి.. ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గాజాలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వేల మందికి అత్యవసర వస్తువులను పాలస్తీనాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయ, మానవతా విభాగం అందిస్తోంది. దీని ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను వసతి గృహాలుగా మార్చింది. వీటిల్లో వేల సంఖ్యలో పునరావాసం పొందుతున్నారు.

అయితే, ఇరువైపుల దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న గాజావాసుల కోసం ఈజిప్టు నుంచి పరిమిత స్థాయిలో సాయం అందుతోంది. ఈ క్రమంలో దీన స్థితిని ఎదుర్కొంటున్న వేలాది మంది నిస్సహాయులు.. గోదాంలలోకి చొరబడి గోధుమలు, పిండి, ఇతర నిత్యవసర వస్తువులు తీసుకెళ్లినట్లు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ వెల్లడించింది.ఇలా గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకర అంశమని.. స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ గాజా డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నారు. భయం, ఆందోళన, నిరాశతో ఉన్న గాజావాసుల్లో ఓపిన నశిస్తుందనడానికి ఇది అద్దం పడుతోందన్నారు. ఈజిప్టు నుంచి ట్రక్కుల్లో వస్తోన్న మానవతాసాయం సరిపోవడంలేదని.. మార్కెట్లో వీటి నిల్వలు నిండుకుంటున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రత్యేక షెల్టర్లు కిక్కిరిసిపోతున్నాయని.. ఒక్కో షెల్టర్లో సాధారణం కంటే 12 రెట్లు ఎక్కువ జనం తలదాచుకుంటున్నారని అన్నారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య జరుగుతోన్న యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ రక్తపాతానికి ముగింపు పలకాలంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌, ఆంటోనియో గుటెరస్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు. గాజాలో పరిస్థితులు గంట గంటకు క్షీణిస్తున్నాయని.. అంతర్జాతీయ మానవతా సాయం అవసరమైన వేళ ఇజ్రాయెల్‌ సైనిక దాడులు పెరగడం పట్ల చింతిస్తున్నానని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..