Heavy Lift Drone: మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

Heavy Lift Drone: మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

Anil kumar poka

|

Updated on: Aug 14, 2024 | 1:01 PM

చైనా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తాజాగా పరీక్షించింది. రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్‌ ఏకంగా 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. సిచవాన్‌ ప్రావిన్స్‌లో దాదాపు 20 నిమిషాలపాటు ప్రయోగం జరిగింది. ఆ డ్రోన్​ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది. దీనిని సిచువాన్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ రూపొందించింది.

చైనా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తాజాగా పరీక్షించింది. రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్‌ ఏకంగా 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. సిచవాన్‌ ప్రావిన్స్‌లో దాదాపు 20 నిమిషాలపాటు ప్రయోగం జరిగింది. ఆ డ్రోన్​ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది. దీనిని సిచువాన్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ రూపొందించింది. డ్రోన్ల విషయంలో శరవేగంగా చైనా పురోగతి సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. జూన్‌లో ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ తయారుచేసిన హెచ్‌హెచ్‌-100 అనే కార్గో డ్రోన్‌ను పరీక్షించింది. ఇది దాదాపు 700 కేజీల బరువును తీసుకొని 520 కిలోమీటర్ల పాటు ప్రయాణించింది. వచ్చే ఏడాది టీపీ2000 అనే యూఏవీని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది చైనా. ఇది 2 టన్నుల పేలోడ్‌తో 2,000 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా వేస్తున్నారు. మరోవైపు, చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో లోఆల్టిట్యూడ్‌ ఎకానమీ డ్రోన్ల వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇది 2030 నాటికి నాలుగు రెట్లు పెరిగి 270 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆ దేశ ఏవియేషన్‌ రెగ్యులేటరీ అంచనా వేసింది. దీనిలో ప్రయాణికులను, సరకులను రవాణా చేయాలని పేర్కొంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్వాంగ్జుకు చెందిన ఈహంగ్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థకు చెందిన మానవ రవాణా డ్రోన్‌కు అనుమతులు ఇచ్చింది. 2023 నాటికి చైనాలో దాదాపు 2,000కు పైగా సంస్థలు డ్రోన్ల తయారీ, డిజైన్‌లో పని చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.