మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం

|

Feb 17, 2024 | 9:53 AM

అయోధ్యలో బాలరాముడు కొలువైన శుభవేళ 2024 అంతా శుభప్రదంగా జరుగుతోందా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ యూఏఈలోని అబుదాబిలో ప్రారంభించి బోచాసన్‌ నివాసి శ్రీఅక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ దేవాలయం. ఇప్పడు మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మాణం కాబోతోంది. ఇందుకు ఆ దేశ రాజు భూమిని కూడా విరాళంగా అందించారు.

అయోధ్యలో బాలరాముడు కొలువైన శుభవేళ 2024 అంతా శుభప్రదంగా జరుగుతోందా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ యూఏఈలోని అబుదాబిలో ప్రారంభించి బోచాసన్‌ నివాసి శ్రీఅక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ దేవాలయం. ఇప్పడు మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మాణం కాబోతోంది. ఇందుకు ఆ దేశ రాజు భూమిని కూడా విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూఏఈ తర్వాత మరో ముస్లిం దేశమైన బహ్రెయిన్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది. ఈ ఆలయాన్ని కూడా BAPS సంస్థే నిర్మించబోతోంది. ఈ నేపధ్యంలో BAPS ప్రతినిధి బృందం బహ్రెయిన్ పాలకునితో సమావేశమైంది. ఆలయం కోసం బహ్రెయిన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బొప్పాయి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు.. గాల్లో విమానాలు చక్కర్లు.. చివరికి ??

చేతిలో చేయి వేసి.. కళ్లలోకి చూసుకుంటూ.. ప్రాణాలు విడిచిన మాజీ ప్రధాని దంపతులు

ప్రేమికులకు బంపర్ ఆఫర్.. ‘వాడుకోండి.. ఎంజాయ్‌ చేయండి’

Vijay Thalapathy: ఎంత హీరో అయితే మాత్రం అప్పనంగా అన్ని కోట్లు అడుగుతాడా ??