Boat Accident: జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!

Boat Accident: జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!

Anil kumar poka

|

Updated on: Oct 09, 2024 | 7:15 PM

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా పట్టణం నుంచి గోమా పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు బోల్తాపడింది. ఓవర్‌ లోడ్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. కివూ సరస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా పట్టణం నుంచి గోమా పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు బోల్తాపడింది. ఓవర్‌ లోడ్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. కివూ సరస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. ప్రమాద ఘటనలో కొందరు ఈదుతూ ఒడ్డుకు రాగా, మరికొందరిని రక్షణ దళాలు కాపాడాయని దక్షిణ కివు ప్రావిన్స్‌ గవర్నర్‌ జీన్‌ జాక్వెస్‌ పురుషి తెలిపారు. అయితే మరణాలకు సంబంధించి కచ్చితమైన సంఖ్య తెలియడానికి మరో రెండు రోజులు పడుతుందన్నారు.

ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని, గల్లంతైన 78 మందిలో అందరి మృతదేహాలు లభ్యం కాలేదని అన్నారు. కాంగో ప్రభుత్వ బలగాలకు, M23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా యుద్ధమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.