Bangladesh: తప్పుడు లేబుల్స్‌ కారణంగా 41 మంది మృతి.. చిన్న పొరపాటు పెద్ద ముప్పు..

Bangladesh: తప్పుడు లేబుల్స్‌ కారణంగా 41 మంది మృతి.. చిన్న పొరపాటు పెద్ద ముప్పు..

Anil kumar poka

|

Updated on: Jun 15, 2022 | 8:58 AM

బంగ్లాదేశ్‌ తాజా అగ్నిప్రమాదంలో మొత్తం 41 మంది మరణించారు. కంటైనర్లలోని కెమికల్స్‌ను తెలియజేస్తూ ఉండాల్సిన లేబుల్స్‌లో జరిగిన తప్పిదం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. డిపోలో నిల్వ చేసిన కంటైనర్లలో..


బంగ్లాదేశ్‌ తాజా అగ్నిప్రమాదంలో మొత్తం 41 మంది మరణించారు. కంటైనర్లలోని కెమికల్స్‌ను తెలియజేస్తూ ఉండాల్సిన లేబుల్స్‌లో జరిగిన తప్పిదం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. డిపోలో నిల్వ చేసిన కంటైనర్లలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉంది. కానీ, వాటిపై లేబుల్స్‌ వేరేలా ఉన్నాయి. డిపోలో మంటలు చెలరేగగానే పెద్దసంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు. వారు ఈ లేబుల్స్‌ను చూసి.. కంటైనర్లపై నీటిని వెదజల్లారు. మంటల్లో చిక్కుకొన్న హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌పై నీరు పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ ధాటికి కంటైనర్‌ 500 అడుగులు ఎత్తు ఎగిరిపడింది. సమీపంలోని వారు కొన్ని మీటర్ల దూరంలోకి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా మరణించారు. వాస్తవానికి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌పై నీటికి బదులు ప్రత్యేకమైన ఫోమ్‌ వెదజల్లాలి.చిట్టగాంగ్‌ పోర్టుకు సమీపంలోని సీతాకుండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంటైనర్‌ డిపోలో మంటలు చెలరేగి.. తర్వాత భారీ పేలుడు చోటు చేసుకొన్న ఘటనలో అగ్నిమాపక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. ‘‘హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ మంటల్లో చిక్కుకుంటే దానిపై ఎట్టిపరిస్థితుల్లో నీరు పోయకూడదని మా నిబంధనల్లో ఉంది. మా సిబ్బందికి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అని తెలియక నీటిని వెదజల్లారు’’ అని చెప్పారు. ఆ కంటైనెర్‌ డిపోలో ఇప్పటికీ మంటలు చెలరేగుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 15, 2022 08:58 AM