Volcano Eruption: బద్దలైన భారీ అగ్నిపర్వతం.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. వీడియో చూస్తే షాకే.
ఇటీవల వరుస భూకంపాలతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ప్రకృతి విపత్తు సంభవించింది. దేశంలోని అత్యంత ఎత్తయిన 'మౌంట్ సెమేరు' అగ్ని పర్వతం బద్దలైంది.
ఇండోనేషియా విపత్తు పర్యవేక్షణ సంస్థ, BNPB, అగ్నిపర్వతం విస్ఫోటనం కేంద్రానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి కార్యకలాపాలు చేయవద్దని, లావా ప్రవహించే ప్రమాదం ఉన్నందున నది ఒడ్డుకు 500 మీటర్ల దూరంలో ఉండాలని స్థానికులను హెచ్చరించింది. వేలాది మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి జోకో సంబాంగ్ తెలిపారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. సెమేరు పర్వతం గతేడాది డిసెంబర్‌లోనూ బద్దలైంది. ఆ సమయంలో 50 మంది ప్రాణాలు కోల్పోగా చాలామంది నిరాశ్రయులయ్యారు. కాగా సెమేరు విస్పోటనం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో, పరిసర ప్రాంతాల్లో గోధుమ బూడిద మేఘాలు కనిపిస్తున్నాయి. ఇండోనేషియా అధికారులు స్థానిక నివాసితులకు మాస్క్‌లను పంపిణీ చేశారు. అదే సమయంలో, ఈ పేలుడు తరువాత అక్కడ సునామీ వచ్చే అవకాశాన్ని పర్యవేక్షిస్తున్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ఈ సమాచారాన్ని అందించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..