Shoaib Akhtar: అక్తర్ రూ. 10కోట్ల నష్టపరిహారం కేసు.! ముందస్తు సమాచారం లేకుండా రాజీనామా చేయడంతో.. (వీడియో)
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్ పీటీఈ 10 కోట్ల దావా వేసింది. అక్తర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఛానల్‌ను వదిలిపెట్టడని, నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్ జరుగుతున్న
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్ పీటీఈ 10 కోట్ల దావా వేసింది. అక్తర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఛానల్‌ను వదిలిపెట్టడని, నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్ జరుగుతున్న దుబాయి విడిచిపెట్టి వెళ్లిపోయాడని.. దీంతో తమ పరువుకు నష్టం వాటిల్లిందంటూ అక్తర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనికిగాను అతను తమకు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.
అయితే మూడు నెలల రాత పూర్వక నోటీసు లేదా అందుకు సమానవైన డబ్బులు చెల్లించి ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరు పక్షాలకు ఉంటుంది. అక్తర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాజీనామా చేయడంతో మా సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. పైగా అతను భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఒక ఇండియన్ టీవీ షోలో పాల్గొనడం వల్ల మాకు తీరని నష్టం కలిగింది. అందువల్ల అతను పీటీవీ ఛానెల్ మూడు నెలల జీతానికి సమానమైన 33లక్షల 33వేలతో పాటు నష్టపరిహారంగా 10 కోట్లు చెల్లించాల్సిందేనని నోటీసుల్లో తెలిపింది పీటీఈ ఛానల్. లేదంటే అక్తర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా పీటీఈ ఇటీవల నిర్వహించిన ఓ లైవ్‌షోలో హోస్ట్ నౌమన్ నియాజ్ అక్తర్‌ను బయటకు వెళ్లిపోవాలని అవమానపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆ క్షణమే తన మైక్రోఫోన్‌ను విసిరేసి అక్తర్ బయటకు వెళ్లిపోయాడు. ఆతర్వాత ఛానెల్‌కు కూడా రాజీనామా చేశాడు.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…