Michoung Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను.! అల్లకల్లోలంగా సముద్రం, భారీ వర్షాలు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను కోస్తావైపు కదులుతున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతనికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాతావరణశాఖ తాజా వెల్లడించిన వివరాల ప్రకారం పాండిచ్చేరికి 200 కిలోమీటర్లు, చెన్నైకి 130 కిలో మీటర్లు, నెల్లూరుకు 220, బాపట్లకు 330, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను కోస్తావైపు కదులుతున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతనికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాతావరణశాఖ తాజా వెల్లడించిన వివరాల ప్రకారం పాండిచ్చేరికి 200 కిలోమీటర్లు, చెన్నైకి 130 కిలో మీటర్లు, నెల్లూరుకు 220, బాపట్లకు 330, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సోమవారం రాత్రి నుంచి మంగళివారం ఉదయం లోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులను వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తా, రాయలసీమలో సోమ మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
విశాఖ, అనకాపల్లి జిల్లాలో తుఫాను ప్రభావం మొదలైంది. ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తుఫాను నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖపట్టణ ప్రాంతంలో తుఫాను రక్షిత భవనాలు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంత ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలించేందుకుఏర్పాట్లు చేశారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో 200 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సముద్రం అల్లకల్లోంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి సముద్ర తీరం కోతకు గురవుతోంది. తీరప్రాంతలోని మత్స్యకారులను సురక్షింత ప్రాంతాలకు తరలించారు. ఉమ్మడిచిత్తూరు జిల్లాలో తుఫాను ప్రభావం మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుపతి జిల్లాలో అత్యధికంగా బి.ఎన్ కండ్రిగ మండలంలో 156.8 మిల్లీ మీటర్లు, వరదయ్యపాలెం మండలంలో 129.2 మిల్లీ మీటర్లు, శ్రీకాళహస్తిలో 124.0 మిల్లీ మీటర్లు వర్షపాతంనమోదైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.