కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు.. సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు

|

Sep 07, 2024 | 12:09 PM

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవిత సందడి నెలకొంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. మహా గణపతి పూజలకు ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిగా..

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవిత సందడి నెలకొంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. మహా గణపతి పూజలకు ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఖైరతాబాద్‌లోని వినాయక దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వామివారికి పూజలు చేయనున్నారు.