AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

Phani CH
|

Updated on: Jun 05, 2024 | 3:02 PM

Share

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం. అందుకే ఒక వ్యక్తి రోజుకి 4 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు, ఉదయాన్నే లేవగానే మంచినీళ్లు తాగాలని సూచిస్తారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే చాలా మంచిది. దీని వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే శరీరంలోని అన్ని రక్త నాళాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం. అందుకే ఒక వ్యక్తి రోజుకి 4 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు, ఉదయాన్నే లేవగానే మంచినీళ్లు తాగాలని సూచిస్తారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే చాలా మంచిది. దీని వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే శరీరంలోని అన్ని రక్త నాళాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో పొట్టకు సంబంధించిన కండరాల నొప్పులు దూరమవుతాయి. శరీరంలో టాక్సిన్స్‌ దూరమై కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, అసౌకర్యం వంటివి మాయమౌతాయి. ప్రేగు కదలికల్ని కంట్రోల్‌ చేసి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడంవలన జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ఱమవుతుంది. ఎసిడిటీ, దగ్గు వంటివి నయమవుతాయి. పరగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వలన శరీరం బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి, బాడీలోని అదనపు కేలరీలు కరిగేలా చేస్తుంది. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం వలన కిడ్నీలు శుభ్రమవుతాయి, వాటి పనితీరు మెరుగవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే ట్యాక్సిన్స్‌ దూరమై, ప్రేగు కదలికలు మెరుగవుతాయి. దీంతో చర్మం క్లీన్‌ అవుతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా దూరమవుతాయి. ఈ విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని ప్రయోగించే ముందు మీ వైద్యులను సంప్రదించండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్లో మీ ​ సీట్లో మరొకరు కూర్చున్నారా ?? గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో

రిజల్ట్‌ బయటికి వచ్చిన వేళ ఏపీ బాట పట్టిన స్టార్ డైరెక్టర్

శ్రద్ధా చేసిన ఒక్క కామెంట్.. ప్రభాస్‌ మంచితనాన్ని మరో సారి బయటపెట్టిందిగా

దళపతి సినిమాకు కొత్త కష్టం.. ఈ స్టార్‌ ధాటికి వణుతున్న ప్రొడ్యూసర్స్‌