దళపతి సినిమాకు కొత్త కష్టం.. ఈ స్టార్‌ ధాటికి వణుతున్న ప్రొడ్యూసర్స్‌

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ఆయన ఓ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. దీంతో ఇక విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని.. పూర్తిగా రాజకీయాల పైనే ఆయన దృష్టి పెట్టనున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ న్యూస్‌కు తగ్గట్టే... విజయ్ చివరగా ఓ రెండు మూడు సినిమాల్లో నటించి తన ఫ్యాన్స్‌కు ఐఫీస్ట్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని టాక్ వస్తోంది.

దళపతి సినిమాకు కొత్త కష్టం.. ఈ స్టార్‌ ధాటికి వణుతున్న ప్రొడ్యూసర్స్‌

|

Updated on: Jun 05, 2024 | 2:53 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ఆయన ఓ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. దీంతో ఇక విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని.. పూర్తిగా రాజకీయాల పైనే ఆయన దృష్టి పెట్టనున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ న్యూస్‌కు తగ్గట్టే… విజయ్ చివరగా ఓ రెండు మూడు సినిమాల్లో నటించి తన ఫ్యాన్స్‌కు ఐఫీస్ట్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని టాక్ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే విజయ్‌ చివరి సినిమాకు పెద్ద కష్టమొచ్చిందనే న్యూస్ వస్తోంది కోలీవుడ్ మీడియాలో..! విజయ్ ప్రస్తుతం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5న సినిమా విడుదలకు మేకర్స్‌ సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్లో దళపతి 69 సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు విజయ్‌. ఈ సినిమాతోనే పూర్తిగా తన ఫిల్మ్ కెరీర్‌కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమాకే ఇప్పుడు చిక్కుల్లో పడిందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు నిర్మాత కష్టం వచ్చింపడిదంట. విజయ్ 69వ చిత్రాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గారని న్యూస్. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో దానయ్య దిట్ట. అయితే విజయ్ సినిమాను నిర్మించేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. దీనికి విజయ్ రెమ్యునరేషనే కారణమని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకు 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ, అప్పుడు అతను 250 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. మరి విజయ్ తన పారితోషికాన్ని తగ్గించుకుంటాడా లేదా అన్నది చూడాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడియోలో ఏడ్చి రచ్చ చేసింది.. పోలీసోళ్లను తింగరోళ్లను చేసింది.. ఎంతైనా గ్రేట్ పో

Follow us