తల్లి ప్రేమ.. తప్పుడు పని చేయించింది.. అసలు ఏం జరిగిందంటే

పుణెలో ఓ మైనర్‌ మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన కేసులో బాలుడి తల్లిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా సమయంలో బాలుడి రక్తంలో మద్యం ఉందా లేదా అన్న పరీక్ష నిర్వహించే సమయంలో ఆమె తన రక్తాన్ని ల్యాబ్‌కు పంపిందని పోలీసులు నిర్ధరించారు. అందుకే తొలిసారి బ్లడ్‌ టెస్ట్ చేసినప్పుడు బాలుడి రక్తంలో ఆల్కహాల్‌ లేదన్న ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.

తల్లి ప్రేమ.. తప్పుడు పని చేయించింది.. అసలు ఏం జరిగిందంటే

|

Updated on: Jun 05, 2024 | 3:04 PM

పుణెలో ఓ మైనర్‌ మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన కేసులో బాలుడి తల్లిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా సమయంలో బాలుడి రక్తంలో మద్యం ఉందా లేదా అన్న పరీక్ష నిర్వహించే సమయంలో ఆమె తన రక్తాన్ని ల్యాబ్‌కు పంపిందని పోలీసులు నిర్ధరించారు. అందుకే తొలిసారి బ్లడ్‌ టెస్ట్ చేసినప్పుడు బాలుడి రక్తంలో ఆల్కహాల్‌ లేదన్న ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఆమె తన కుమారుడిని కేసు నుంచి బయటపడేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వాకానికి ఒడిగట్టినట్లు వివరించారు. ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఇదివరకు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా నిందితుడి రక్త నమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్‌ కుదిరిందని తెలిపాయి. ఈ క్రమంలోనే బాలుడి తల్లి శాంపిళ్లను బ్లడ్‌ టెస్ట్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అయితే రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె, తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ట్రైన్లో మీ ​ సీట్లో మరొకరు కూర్చున్నారా ?? గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో

రిజల్ట్‌ బయటికి వచ్చిన వేళ ఏపీ బాట పట్టిన స్టార్ డైరెక్టర్

శ్రద్ధా చేసిన ఒక్క కామెంట్.. ప్రభాస్‌ మంచితనాన్ని మరో సారి బయటపెట్టిందిగా

Follow us