Youtuber: క్రేజీతో పాటు సంపాదన తెచ్చిపెడుతున్న వీడియోలు.. మోసం చేస్తున్నట్లు ఒప్పేసుకున్న యూట్యూబర్.

కష్ట పడకుండా సంపాదించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతోంది యువత. చెమటోడ్చకుండానే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌.. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న పేరు. ప్రత్యేకంగా చెప్పాలంటే వినోదంతో పాటు..

Youtuber: క్రేజీతో పాటు సంపాదన తెచ్చిపెడుతున్న వీడియోలు.. మోసం చేస్తున్నట్లు ఒప్పేసుకున్న యూట్యూబర్.

|

Updated on: Oct 27, 2022 | 9:48 AM


గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్‌ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటి యూజర్లు విపరీతంగా పెరిగిపోయింది. కొందరు దీని ఎంటర్‌టైన్‌మెంట్‌ సాధనంగా చూస్తుంటే మరికొందరు తమ ఉపాధికి యూట్యూబ్‌ని మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.మార్క్ ఫిష్‌బాచ్ అనే ఒక యూట్యూబర్ ఏడాదిలో యూట్యూబ్‌ ద్వారా 38 మిలియన్‌ డాలర్లు అంటే 312 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన చూసి అతనే ఆశ్చర్యపోతున్నాడట. అయితే ఎందుకో గానీ ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు అతనే స్వయంగా అంగీకరించాడు. యూట్యూబ్‌ ప్రారంభించిన మొదట్లో అనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో సంపద రావడంతో మోసం చేస్తున్న భావన కలుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వ్యక్తి మార్క్‌ సంపాదన గురించి అడిగాడు. అందుకు అతను బదులిస్తూ.. సంపాదన రావడం వెనుక సమాజాన్ని మోసగిస్తున్నట్లు నిజం ఒప్పేసుకున్నాడు. భవిష్యత్తులో తన సంపాదనతో ప్రజలకు సహాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow us