యూట్యూబ్‌ వీడియో కోసం ఏకంగా విమానాన్నే కూల్చేసాడు

యూట్యూబ్‌ వీడియో కోసం ఏకంగా విమానాన్నే కూల్చేసాడు

Phani CH

|

Updated on: May 18, 2023 | 2:01 PM

యూట్యూబ్‌ వీడియో వ్యూయర్‌షిప్‌ కోసం ఏకంగా విమానాన్నే కూల్చేశాడో ఘనుడు. అధికారులు విచారించగా.. తనకేం తెలియనది ఇంజిన్‌ ఫెయిలైందని బుకాయించాడు. కానీ, అధికారులు పక్కా ఆధారాలతో ప్రశ్నించే సరికి తానే విమానం కూల్చేసినట్లు అంగీకరించాడు. అమెరికాలోని ట్రెవొర్‌ జాకబ్‌..

యూట్యూబ్‌ వీడియో వ్యూయర్‌షిప్‌ కోసం ఏకంగా విమానాన్నే కూల్చేశాడో ఘనుడు. అధికారులు విచారించగా.. తనకేం తెలియనది ఇంజిన్‌ ఫెయిలైందని బుకాయించాడు. కానీ, అధికారులు పక్కా ఆధారాలతో ప్రశ్నించే సరికి తానే విమానం కూల్చేసినట్లు అంగీకరించాడు. అమెరికాలోని ట్రెవొర్‌ జాకబ్‌.. ఒలింపిక్‌ స్నోబోర్డ్‌ క్రీడాకారుడు. అతని యూట్యూబ్‌ ఛానెల్‌కి లక్షమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2021లో తన స్నేహితుడి చితాభస్మాన్ని వెదజల్లాలి అని చెప్పి లోంపోక్‌ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్‌ ఇంజిన్‌ లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తీసుకొని ఒంటరిగా బయల్దేరాడు. అతడు లాస్‌ పాడ్రెస్‌ నేషనల్‌ పార్క్‌పై ఎగురుతుండగా విమానం కూలిపోయింది. పారాచూట్‌ సాయంతో ఆ ప్రమాదం నుంచి ట్రెవొర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తొలుత అందరూ అది ప్రమాదమే అనుకొన్నారు. నెల రోజుల తరవాత ట్రెవొర్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘‘నేను విమానాన్ని కూల్చేశాను’’ అనే టైటిల్‌తో ఓ వీడియో పోస్టు చేశాడు. విమానం ఇంజిన్‌లో సమస్యలు రావడంతో పారాచూట్‌ సాయంతో తాను బయటకు దూకాల్సి వచ్చిందని వెల్లడించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న సినిమా అయినా.. రిలీజ్‌కు ముందే 21కోట్ల బిజినెస్

10రోజుల్లోనే 100కోట్లు.. కలెక్షన్లు కొల్లగొడుతున్న 2018 ఫిల్మ్ !!

వదినా ?? లేక రష్మికా ?? ప్రశ్నిస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే ??

బిగ్ బీ ఓవర్‌ యాక్షన్ కు.. పోలీసుల యాక్షన్ రియాక్షన్.. అట్లుంటది మరి

Tarun: తరుణ్ విషయంలోనే బాధగాఉంది.. నిజాలు చెప్పిన రోజా రమణి..