లో బడ్జెట్ సినిమా షూటింగ్ అంటే ఇదే !! సోషల్ మీడియాలో వీడియో వైరల్
రెండు గంటలు థియేటర్‌లో కూర్చుని సినిమా చూసి, క్షణాల్లో హిట్టా, ఫట్టా అని తేల్చేస్తాం. కానీ ఆ సినిమా తీయాలంటే..కోట్లతో పని. నటులు, కెమెరాలు, పరికరాలు, సెట్టింగులు, వందల్లో పనివాళ్లు..
రెండు గంటలు థియేటర్‌లో కూర్చుని సినిమా చూసి, క్షణాల్లో హిట్టా, ఫట్టా అని తేల్చేస్తాం. కానీ ఆ సినిమా తీయాలంటే..కోట్లతో పని. నటులు, కెమెరాలు, పరికరాలు, సెట్టింగులు, వందల్లో పనివాళ్లు.. ఇంకెన్నో! ఓ చిన్న సినిమా తీయాలన్నా డబ్బులు తక్కువేమీ కావు. లో బడ్జెట్ సినిమా అనుకున్నా లక్షల్లోనే అవుతాయి. కానీ ఇక్కడ కొందరు యువకులు తెలివిగా ఆలోచించి తక్కవ బడ్జెట్‌లో సినిమా ఎలా తీయాలో చూపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక్కడ యువకులు చేస్తున్న ‘షూటింగ్’ కాస్త ఆసక్తిగానూ, ఇంకాస్త నవ్వు తెప్పించేదిగానూ ఉంది. వీడియో తీసేందుకు వాళ్లు ఉపయోగిస్తున్నవి రెండే రెండు.. ఒకటి సెల్ ఫోన్.. రెండు చెప్పులు!! అందుకే ఆ వీడియో వైరల్ అయి కూర్చుంది. ‘ది ఫిజెన్’ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘మీ సినిమా బడ్జెట్ 20 డాలర్లు అయినప్పుడు’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అందులో క్లాప్ కొట్టేందుకు ఓ యువకుడు చెప్పులను ఉపయోగించాడు. యాక్టర్ నడుచుకుంటూ వెళ్తుండగా.. కింద పడుకున్న ‘కెమెరా మ్యాన్’ ఫోన్ లో షూట్ చేశాడు. యాక్టర్ తో పాటు ‘కెమెరా’ మూవ్ అయ్యేందుకు కింద పడుకున్న కెమెరా మ్యాన్ ను ఇంకో యువకుడు మెల్లగా ఈడ్చుకుంటూ వెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌదీ అరేబియాలో మరో అద్భుత కట్టడం.. మెస్మరైజ్ చేస్తున్న డిజైన్ !!
వాషింగ్ మెషీన్ లోని సబ్బునీళ్లలో 15 ని.లపాటు తిరిగిన యేడాదిన్నర చిన్నారి !! చివరికి ??
దెబ్బకు దిగివచ్చిన HCA !! ఎన్టీఆర్ ఫ్యాన్సా.. మజాకా..
Koratala Siva: రాజమౌళి కారణంగా చిక్కుల్లో కొరటాల శివ !!
RC15: క్రేజీ అప్డేట్ !! RC15 ఫస్ట్ లుక్ లోడింగ్ !!