వారికి ఆస్పత్రే మండపం.. మంచమే పెళ్లి పీట.. ఆస్పత్రి బెడ్‌పైనే !!
ఈ పెళ్లి.. మండపంలో జరిగివుంటే.. వైరల్ అయ్యేది కాదు. ఆస్పత్రిలో జరగడం వల్ల చర్చకు దారితీసింది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనూ ప్రేమ ఉంటుంది.
ఈ పెళ్లి.. మండపంలో జరిగివుంటే.. వైరల్ అయ్యేది కాదు. ఆస్పత్రిలో జరగడం వల్ల చర్చకు దారితీసింది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనూ ప్రేమ ఉంటుంది. నిశ్చితార్థం జరిగిన మరుక్షణం నుంచి ఆ జంట మధ్య ప్రేమ మొదలవుతుంది. అది పెళ్లిపీటలు ఎక్కిస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన. పెళ్లికి కొన్ని రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వధువును.. వరుడు పట్టుపట్టి మరీ ఆమెను ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా పట్టణంలో ఈ వివాహం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వధూవరులు.. ఒక్కటయ్యారు. జ్జయినీకి చెందిన సౌదాన్ సింగ్ కొడుకు రాజేంద్ర, జల్వానియా గ్రామానికి చెందిన సుభాష్ కూతురు శివానీతో ఫిబ్రవరి 16న పెళ్లి నిశ్చయమైంది. ఖండ్వాలో ఘనంగా పెళ్లి జరిపించాలని రెండు కుటుంబాలు నిర్ణయించాయి. కానీ పెళ్లికి ఒక రోజు ముందు.. వధువుకి యాక్సిడెంట్ జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. దీంతో ఆమె ఆస్పత్రి బెడ్ నుంచి కిందకు దిగే పరిస్థితి లేదు. అందుకే ఆమె ఆస్పత్రి బెడ్‌పై ఉండగానే ముహూర్త సమయానికి వరుడు తాళి కట్టాలనుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లో బడ్జెట్ సినిమా షూటింగ్ అంటే ఇదే !! సోషల్ మీడియాలో వీడియో వైరల్
సౌదీ అరేబియాలో మరో అద్భుత కట్టడం.. మెస్మరైజ్ చేస్తున్న డిజైన్ !!
వాషింగ్ మెషీన్ లోని సబ్బునీళ్లలో 15 ని.లపాటు తిరిగిన యేడాదిన్నర చిన్నారి !! చివరికి ??
దెబ్బకు దిగివచ్చిన HCA !! ఎన్టీఆర్ ఫ్యాన్సా.. మజాకా..
Koratala Siva: రాజమౌళి కారణంగా చిక్కుల్లో కొరటాల శివ !!