Cockroaches In Dosa: దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?

బొద్దింక - చూడటానికి చిన్నగా ఉన్నా చెట్టంత మనిషిని వణికిస్తుంది. చాలా మందికి దాన్ని చూస్తే ఒక లాంటి వికారంతో భయపడుతుంటారు. అలాంటిది బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్‌, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.

Cockroaches In Dosa: దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?

|

Updated on: Mar 19, 2024 | 10:19 AM

బొద్దింక – చూడటానికి చిన్నగా ఉన్నా చెట్టంత మనిషిని వణికిస్తుంది. చాలా మందికి దాన్ని చూస్తే ఒక లాంటి వికారంతో భయపడుతుంటారు. అలాంటిది బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త “ఆహారంలో బొద్దింక”. ట్రైన్, రెస్టారెంట్‌, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఓ రెస్టారెంట్‌లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అందులో అనుమానాస్పదంగా నల్లటి చుక్కలు కనిపించాయి. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు ​కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్‌ అయింది. దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోండగా . హోటల్‌ సిబ్బందిలో ఒకడు ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా ప్లేట్‌ను లాగేసుకున్నాడు. ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్‌లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్‌లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్‌’ షేర్‌ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us