వరుడు టైంకు రాలేదని.. బావను పెళ్లాడిన యువతి !!

వరుడు టైంకు రాలేదని.. బావను పెళ్లాడిన యువతి !!

Phani CH

|

Updated on: Mar 02, 2024 | 7:14 PM

వివాహ వేడుకకు వరుడు సమయానికి రాకపోవడంతో ఓ వధువు తన బావను పెళ్లాడింది. యూపీలోని ఝాన్సీ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. సీఎం సామూహిక వివాహ పథకం కింద యూపీ ప్రభుత్వం నూతన దంపతులకు 51 వేల రూపాయల చొప్పున ఇస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాల వేదికగా జరిగిన సామూహిక వివాహ వేడుకలో 132 జంటలకు పెళ్లిళ్లయ్యాయి. బామౌర్‌కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌కు చెందిన వృష్ భానుతో నిశ్చయమైంది.

వివాహ వేడుకకు వరుడు సమయానికి రాకపోవడంతో ఓ వధువు తన బావను పెళ్లాడింది. యూపీలోని ఝాన్సీ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. సీఎం సామూహిక వివాహ పథకం కింద యూపీ ప్రభుత్వం నూతన దంపతులకు 51 వేల రూపాయల చొప్పున ఇస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాల వేదికగా జరిగిన సామూహిక వివాహ వేడుకలో 132 జంటలకు పెళ్లిళ్లయ్యాయి. బామౌర్‌కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌కు చెందిన వృష్ భానుతో నిశ్చయమైంది. అయితే, పెళ్లి సమయంలో మాత్రం వధువు పక్కన మరో వ్యక్తి కనిపించాడు. అధికారులు ఆరా తీయగా పెళ్లికొడుకు వేళకు రాలేదని తేలింది. దీంతో, పెద్దల సలహాతో తాను కూర్చున్నట్టు నకిలీ వరుడు చెప్పాడు. అతడు ఖుషీకి వరుసకు బావ అవుతాడని కూడా తెలిసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. మూడు రోజుల కార్యక్రమాలు ఇవే

మూగ జీవుల సంరక్షణకు 3 వేల ఎకరాల్లో అడవి ఏర్పాటు

కేరళలో రోడ్డుకు ఘనంగా పెళ్లి !! ఎందుకంటే ??

పాకిస్తాన్ లోని పంజాబ్‌ కు తొలి మహిళా సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్‌

కుమారుడు మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా ??