అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. మూడు రోజుల కార్యక్రమాలు ఇవే

ప్రముఖ పారిశ్రామికవేత్త.. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పంక్షన్‌ను అంగరంగ వైభవంగా జరిపించడానికి సన్నద్ధమవుతున్నారు. మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి గ్లోబల్ లీడర్స్, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. రాబోయే అతిధుల కోసం అంబానీ కుటుంబం కావలసినన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. మార్చి 1 నుంచి అతిథులను తీసుకురావడానికి ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు స్పెషల్ చార్టడ్ ఫ్లైట్స్ నడవనున్నట్లు సమాచారం.

అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. మూడు రోజుల కార్యక్రమాలు ఇవే

|

Updated on: Feb 29, 2024 | 10:58 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త.. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పంక్షన్‌ను అంగరంగ వైభవంగా జరిపించడానికి సన్నద్ధమవుతున్నారు. మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి గ్లోబల్ లీడర్స్, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. రాబోయే అతిధుల కోసం అంబానీ కుటుంబం కావలసినన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. మార్చి 1 నుంచి అతిథులను తీసుకురావడానికి ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు స్పెషల్ చార్టడ్ ఫ్లైట్స్ నడవనున్నట్లు సమాచారం. జామ్‌నగర్‌లో కావలసినన్ని స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల అల్ట్రా లగ్జరీ టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల మొదటి రోజు మార్చి 1న యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్‌ల్యాండ్ గా జరుపుకుంటారు. ఇందులో అతిధులు సొగసైన కాక్‌టెయిల్ డ్రెస్సులు ధరించనున్నట్లు సమాచారం. రెండో రోజు ఎ వాక్ ఆన్ ది వైల్డ్‌సైడ్ ని నిర్వహించి, జంగిల్ ఫీవర్ నిర్వహించనున్నారు. దీనికోసం కూడా ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ జామ్‌నగర్‌లోని అంబానీల జంతు సంరక్షణ కేంద్రం బయట నిర్వహించనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూగ జీవుల సంరక్షణకు 3 వేల ఎకరాల్లో అడవి ఏర్పాటు

కేరళలో రోడ్డుకు ఘనంగా పెళ్లి !! ఎందుకంటే ??

పాకిస్తాన్ లోని పంజాబ్‌ కు తొలి మహిళా సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్‌

కుమారుడు మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా ??

Varun Tej: ఎంగేజ్‌మెంట్‌కు..పెళ్లికి గ్యాప్ వచ్చింది ఎందుకంటే ??

Follow us