ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్ పతకం అమ్మడానికి యత్నం !!
పద్మభూషన్.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పద్మభూషన్.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం.. మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ మెడల్‌పైన పద్మభూషణ్ అని రాసి ఉండటంతో అనుమానం వచ్చిన స్వర్ణకారుడు దానిని కొనేందుకు నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. ఈ విషయాన్ని స్వర్ణకారుడు కల్కాజీ పోలీసులకు సమాచారమిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంజెక్షన్ కోసం నరం దొరక్క.. ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

