ఇంజెక్షన్ కోసం నరం దొరక్క.. ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత
అమెరికాలో 40 ఏళ్ల నాటి ఓ హత్య కేసులో దోషికి మరణ శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేయాల్సి వచ్చింది. నిందితుడు 73 ఏళ్ల థామస్ క్రీష్‌కు నరాల ద్వారా ప్రాణాంతక ఇంజెక్షన్‌ను ఇచ్చి శిక్ష అమలు చేయాల్సి ఉండగా వైద్య బృందానికి అతడి ఒంట్లో నరం దొరక్కపోవడంతో శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఐడాహో రాష్ట్రంలో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. ఇంజెక్షన్ కోసం నరం కోసం వైద్య బృందం సుమారు 8 సార్లు ప్రయత్నించిందని అక్కడి జైళ్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు.
అమెరికాలో 40 ఏళ్ల నాటి ఓ హత్య కేసులో దోషికి మరణ శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేయాల్సి వచ్చింది. నిందితుడు 73 ఏళ్ల థామస్ క్రీష్‌కు నరాల ద్వారా ప్రాణాంతక ఇంజెక్షన్‌ను ఇచ్చి శిక్ష అమలు చేయాల్సి ఉండగా వైద్య బృందానికి అతడి ఒంట్లో నరం దొరక్కపోవడంతో శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఐడాహో రాష్ట్రంలో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. ఇంజెక్షన్ కోసం నరం కోసం వైద్య బృందం సుమారు 8 సార్లు ప్రయత్నించిందని అక్కడి జైళ్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు. చేతులే కాకుండా, కాళ్లల్లో కూడా ఇంజెక్షన్‌కు అనువుగా ఐవీ లైన్ లభించలేదన్నారు. ఇక ముందు ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. థామస్‌కు 1981లోనే మరణ శిక్ష పడింది. తన తోటి ఖైదీని చంపినందుకు శిక్ష పడింది. అప్పటికే అతడిపై మరో ఐదు హత్య కేసులు ఉన్నాయి. అయితే, తాను కనీసం డజను మందిని చంపానని అతడు అప్పట్లో తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

