వీల్‌ఛైర్ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా
వీల్‌ఛైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలో ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. వీల్‌ఛైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటన ముంబయి విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకుంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిరిండియాపై చర్యలు తీసుకుంది.
వీల్‌ఛైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలో ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. వీల్‌ఛైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటన ముంబయి విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకుంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిరిండియాపై చర్యలు తీసుకుంది. విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీని పై ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ప్రయాణికుడి భార్యకు వీల్‌ఛైర్ సమకూర్చామని ఎయిరిండియా పేర్కొంది. వీల్‌ఛైర్లకు భారీ డిమాండు ఉన్నందున మరొకటి సమకూర్చేవరకు కొద్దిసేపు వేచి ఉండాలని వారిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. బాధితుడు మాత్రం తన భార్యతో కలిసి టెర్మినల్ వరకు నడుచుకుంటూ వచ్చాడని.. ఇమిగ్రేషన్ తనిఖీ కోసం వేచి చూస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వివరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పగలు భోజనం తర్వాత నిద్ర.. అంత డేంజరా ??
‘మచు పిచ్చు’ను ముంచెత్తిన వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు
సూర్యుడిపై మచ్చ.. ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన
అంబేద్కర్ బొమ్మతో రూ.100 నోట్లు.. మేడారం జాతరలో ఫేక్ కరెన్సీ