‘మచు పిచ్చు’ను ముంచెత్తిన వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు
పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన మాచు పిచ్చు పేరొందిన పర్యాటక ప్రాంతం. వేలాది మంది పర్యటకులతో కిటకిటలాడే ఈ ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం వరదలు పొటెత్తాయి. దీంతో మాచు పిచ్చుకు వెళ్లే రోడ్డు, రైలు మార్గాలు పూర్తిగా బురదమయమయ్యాయి. మట్టిచరియలు విరిగిపడి ఇద్దరు స్థానికులు అదృశ్యమవ్వగా 17మందికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది బురదలో చిక్కుకొన్న వారిని కాపాడేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నారు.
పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన మాచు పిచ్చు పేరొందిన పర్యాటక ప్రాంతం. వేలాది మంది పర్యటకులతో కిటకిటలాడే ఈ ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం వరదలు పొటెత్తాయి. దీంతో మాచు పిచ్చుకు వెళ్లే రోడ్డు, రైలు మార్గాలు పూర్తిగా బురదమయమయ్యాయి. మట్టిచరియలు విరిగిపడి ఇద్దరు స్థానికులు అదృశ్యమవ్వగా 17మందికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది బురదలో చిక్కుకొన్న వారిని కాపాడేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ‘మాచు పిచ్చు’ చుట్టుపక్కల కొన్ని రోజుల క్రితం నదులు పొంగి వరదలు ముంచెత్తాయి. మట్టిచరియలు విరిగిపడ్డాయి. వరదలు తగ్గినా మాచు పిచ్చుకు వెళ్లే రోడ్లు, రైలు మార్గాల్లో ఎక్కడికక్కడ బురద పేరుకుపోయింది. పెరూలో ఉన్న ఈ ప్రపంచ వింతను చూద్దామని వచ్చే పర్యాటకులకు తిప్పలు తప్పడం లేదు. బురద వల్ల రాకపోకలకు అంతరాయమే కాక కొన్ని ప్రమాదాలు జరిగాయి. కనిపించకుండాపోయిన ఇద్దరిని వెతకడానికి సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. బురదల్లో చిక్కుకున్న వారిని చెట్ల దుంగలు, తాళ్ల సాయంతో రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్యుడిపై మచ్చ.. ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన
అంబేద్కర్ బొమ్మతో రూ.100 నోట్లు.. మేడారం జాతరలో ఫేక్ కరెన్సీ
ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్ పతకం అమ్మడానికి యత్నం !!