Thief in well: గర్ల్స్ హాస్టల్‌లో చోరీ చేసి పరార్. కట్ చేస్తే బావిలో తేలాడు..! ఎం జరిగిందంటే..
హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికాడు. హాస్టల్‌లో చోరీ చేసి రాత్రి పారిపోతుండగా వ్యవసాయబావిలో జారిపడ్డాడు.
హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికాడు. హాస్టల్‌లో చోరీ చేసి రాత్రి పారిపోతుండగా వ్యవసాయబావిలో జారిపడ్డాడు. హన్మకొండ శివారులో ఉన్న కాలేజీ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేశాడు. చిమ్మ చీకటిలో పొలాల గుండా పారిపోతుండగా వ్యవసాయ బావిలో పడిపోయాడు. బావిలో నుండి దొంగను గ్రామస్తులు బయటకు తీశారు. హసన్‌పర్తి మండలం అన్నసాగర్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు చోరీ చేశాడు. మూడు రోజల టైమ్‌లో 14 సెల్‌ఫోన్లు, 6 ల్యాప్‌ట్యాప్‌లు ఎత్తుకెళ్లాడు. బాత్‌రూమ్స్ డోర్ పగులగొట్టి హాస్టల్ గదిలోకి దొంగ ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తమకు హాస్టల్‌లో భద్రత లేదని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..